ప్రీప్రైమరీ ప్రారంభమెప్పుడో! | - | Sakshi
Sakshi News home page

ప్రీప్రైమరీ ప్రారంభమెప్పుడో!

Oct 20 2025 7:50 AM | Updated on Oct 20 2025 7:50 AM

ప్రీప్రైమరీ ప్రారంభమెప్పుడో!

ప్రీప్రైమరీ ప్రారంభమెప్పుడో!

● రెండు నెలలైనా ముందుకు సాగట్లే.. ● నిధులు విడుదలైనా షురూ కాని పనులు

ఆదిలాబాద్‌టౌన్‌: దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించలేదన్న చందంగా మారింది విద్యాశాఖ తీరు. జూలై 16న పాఠశాల విద్యాశాఖాధికారులు జిల్లాకు ప్రీప్రైమరీ పాఠశాలలను ఎంపిక చేశారు. గత నెల 27న ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు చేపట్టా రు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ సౌకర్యాలు, మరమ్మతుల పేరిట జాప్యం అవుతున్నట్లు అధికా రులు చెబుతున్నారు. మరోవైపు నియామకమైన ఇన్‌స్ట్రక్టర్లు ఎప్పుడు విధుల్లో చేరుతామోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇవే పాఠశాలలు..

ప్రీప్రైమరీ విద్యాబోధన ప్రారంభించేందుకు జిల్లాలో ఈ ఏడాది 15 పాఠశాలలను ఎంపిక చేయగా, గత విద్యాసంవత్సరంలో నాలుగు పాఠశాలలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేశవపట్నం ప్రాథమిక పాఠశాల, దుబ్బ(కె), కంఠ, తాండబాబాపూర్‌, వైజాపూర్‌, ముత్నూర్‌, బరంపూర్‌, రాంపూర్‌(పి), మల్కాపూర్‌, చెర్లపల్లి, గుబి డి, యాపల్‌గూడ, కేఆర్‌కే కాలనీ, పిప్పల్‌కోటి తెలుగు మీడియం, బాలక్‌మందిర్‌ పాఠశాలలు ఉ న్నాయి. అయితే గతేడాది జైనథ్‌ మండలంలోని దీపాయిగూడ, సిరికొండ, భీంపూర్‌ మండలంలో ని నిపాని, గాదిగూడలోని చింతగూడ పాఠశాలల్లో ప్రారంభించింది.

ప్రారంభమయ్యేదెప్పుడో..

ప్రీప్రైమరీ పాఠశాలల నిర్వహణ కోసంప్రభుత్వం ఒక్కోపాఠశాలకు రూ.లక్ష 70వేలు కేటా యించింది. ఇందులో ఫర్నిచర్‌ కోసం రూ.50వేలు, టీఎల్‌ఎంకోసం రూ.50వేలు, పెయింటింగ్‌ కోసం రూ. 50వేలు, 20మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున ఖర్చు చేయనున్నారు. విద్యార్థులకు షూ, యూనిఫాం అందించాల్సి ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ కోసం ఒక గదిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆకర్షించేలా పెయింటింగ్‌ వేయించాల్సి ఉండగా, ఆ దిశగా పనులు సాగడం లేదు. ఈ నెలలో కూడా తరగతులు ప్రారంభమవుతాయో.. లేదోననే అనుమానం వ్యక్తమవుతుంది. నాలుగేళ్లు పైబడిన చిన్నారులకు ఎల్‌కేజీలో ప్రవేశం కల్పిస్తారు. ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆట పాటలతో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. అయితే 19 పాఠశాలలకు సంబంధించి 18 మంది ఇన్‌స్ట్రక్టర్లను, 17 మంది ఆయాలను ఎంపిక చేశా రు. ఇన్‌స్ట్రక్టర్లకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. పది నెలల పాటు వీరు పనిచేయాల్సి ఉంటుంది. గతేడాది నిపాని పాఠశాల ఎంపికై నప్పటికీ గదులు లేవని సిబ్బంది ని నియమించలేదు. తరగతులు కూడాప్రారంభం కాలేదు. సిరికొండలో ఆయాకు క్వాలిఫికేషన్‌ లేకపోవడంతో నియామకం జరగలేదు. కంఠలో ఆ యా పోస్టు భర్తీకాలేదు. దీపాయిగూడలో గతేడా ది పనిచేసిన వారిని కొనసాగించాలా.. లేదా అనే విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది చింతగూడలో ప్రారంభమైనా ఆమె సక్రమంగా విధులు నిర్వహించడం లేదని తొలగించారు.

త్వరలో ప్రారంభిస్తాం..

ప్రీప్రైమరీ పాఠశాలలకు సంబంధించి ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమించడం జరిగింది. జిల్లాలో గతేడాది నాలుగు పాఠశాలలను ప్రారంభించగా, ఈ ఏడాది మరో 15 ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభిస్తాం.

– అజయ్‌, సెక్టోరల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement