
లైసెన్స్‌డ్ సర్వేయర్లు వచ్చేస్తున్నారు
కై లాస్‌నగర్: జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖలో కొత్తగా లైసెన్స్‌డ్ సర్వేయర్లు వచ్చేస్తున్నారు. జిల్లాలో నిర్వహించిన వృత్తిపరమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 44 మంది ఆ శాఖ అధికారులతో కలిసి ఆదివారం వేకువజామున ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి చేతుల మీదుగా వారు లైసెన్స్ పత్రాలు అందుకున్నారు. గుడిహత్నూర్ మండలం తోషం తండాకు చెందిన జాదవ్ కీర్తి స్వయంగా సీఎం చేతుల నుంచి లైసెన్స్ పత్రం అందుకోగా మిగతా వారికి అక్కడి అధికారులు ప్రత్యేక కౌంటర్ ద్వారా అందజేశారు. దీపావళి తర్వాత వీరంతా జిల్లాలో విధుల్లో చేరనున్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు రాజేందర్, ఉద్యోగులు గోవింద్, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.