
కలంపై జులుం సరికాదు
పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు
ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను కాలరాసేలా వ్యవహరిస్తోంది. మీడియాలో ప్రసారం చేసిన కథనాలపై, దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలపై ఏమైనా అభ్యంతరాలుంటే వివరణ ఇవ్వడమో లేక ఖండిచడమో చేయాలి. కానీ పోలీసులతో నోటీసులు పంపించి ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై బెదిరింపులకు దిగడం అప్రజాస్వామికం. ఈ చర్యలను మానుకోవాలి.
– సిర్రా దేవేందర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి
కై లాస్‌నగర్: నిజాలను నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని వివిధ వర్గాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయ్‌రెడ్డిపై పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయించి జులం ప్రదర్శించడాన్ని వారు తప్పుపట్టారు. మీడియాను అణచివేయాలనే విధానాలు మానుకోవాలని స్పష్టం చేశారు.

కలంపై జులుం సరికాదు