
ఆదివాసీ సంస్కృతికి ప్రతీక దండారీ
నార్నూర్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం దండారీ ఉత్సవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని జామ్‌డా గ్రామంలో ఆదివారం నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఆయన అతిథిగా హాజరయ్యారు. జిల్లా సా ర్‌మేడి దుర్గు పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎస్పీ వారితో కలిసి గుస్సాడి నృత్యం చేశారు. అనంతరం 50 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయలను భావితరాలకు అందించాలన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, నార్నూర్ సీఐ పద్మ, తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఆదివాసీ పెద్దలు చెంచు రామకృష్ణ, ఎస్సైలు సాయన్న, అఖిల్ తదితరులున్నారు.
కేస్లాపూర్‌లో..
ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్‌లో నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యేత్మసూర్ దేవతలకు పూజలు నిర్వహించారు. దండారీలతో కలిసి నృత్యం చేశారు. ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, స్థానిక ఎస్సై సాయన్న, గ్రామ పటేల్ వెంకట్‌రావ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.