‘స్వయం’.. విస్తృతం | - | Sakshi
Sakshi News home page

‘స్వయం’.. విస్తృతం

Oct 20 2025 7:50 AM | Updated on Oct 20 2025 7:50 AM

‘స్వయం’.. విస్తృతం

‘స్వయం’.. విస్తృతం

జిల్లాలో మరిన్ని ఎస్‌హెచ్‌జీలు

కిశోర బాలికలు, వృద్ధ మహిళలు,

దివ్యాంగులతోనూ ఏర్పాటు

కసరత్తు చేస్తున్న సెర్ప్‌ సిబ్బంది

ఈ నెలాఖరు వరకు గడువు

కైలాస్‌నగర్‌:జిల్లాలోని గ్రామీణప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు మరింతగా పెరగనున్నాయి. 15 ఏళ్ల కిశోర బాలికల నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధ మహిళల వరకు ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్‌–2025 కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు ప్ర త్యేక లక్ష్యాన్ని నిర్దేశించింది. వీరితో పాటు దివ్యాంగులతో కూడిన సంఘాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు లక్ష్యాన్ని చేరుకునే దిశగా సెర్ప్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరులో గా సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.

కిశోర బాలికలపై ప్రత్యేక దృష్టి..

ప్రస్తుతం ఎస్‌హెచ్‌జీల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలు మాత్రమే ఉన్నారు. వారికి పొదుపుపై అవగాహన కల్పించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారితో పాటు కేరళ రాష్ట్రంలో అమలవుతున్న కుటుంబ శ్రీ పథకం స్ఫూర్తిగా 15 నుంచి 18 ఏళ్ల లోపు కిశోర బాలికలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. వారిని కూడా సంఘాల్లో సభ్యులుగా చేర్చాలని ఆదేశించింది. వారికి పొదుపుతో పాటు బ్యాంకింగ్‌ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, లైంగిక వేధింపులు సోషల్‌ మీడియా ద్వారా కలిగే అనర్థాలు, ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగ అవకాశాలను వివరించి సద్విని యోగం చేసుకునేలా చైతన్య పర్చనున్నారు.

60 ఏళ్లు పైబడిన వారిని కూడా...

సంఘాల్లో సభ్యులుగా ఉండి 60 ఏళ్లు పైబడిన మహిళలను సాధారణంగా సంఘాల్లో నుంచి తొలగిస్తున్నారు. అయితే ఆ వయస్సు కలిగిన మహిళలతోనూ సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పొదుపు చేసేలా చూడటంతో పాటు ఎలాంటి అండలేనటువంటి వారికి ఆర్థిక చేయూత ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు వారు ఏమైన చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి ప్రోత్సహించనున్నట్లుగా తెలుస్తోంది.

దివ్యాంగులకు సైతం...

దివ్యాంగులతోనూ ఎస్‌హెచ్‌జీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 18 ఏళ్లు నిండిన దివ్యాంగ మహిళలు, పురుషులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సంయుక్తంగా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. వీరికి కూడా అవసరమైన ఆర్థిక చేయూత అందించ ను న్నారు. ఇందులో భాగంగా వ్యాపారాల ని ర్వహణకు గాను బ్యాంకుల ద్వారా రుణా లు అందించేలా చొరవ చూపనున్నారు.

సంఘాల ఏర్పాటు ఇలా..

ప్రతీ వీవో పరిధిలో కొత్తగా నాలుగు స్వయం సహా యక సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆ దేశించింది. ఇందులో ఒకటి జనరల్‌ కాగా, దివ్యాంగులు, వృద్ధ మహిళలు, కిశోర బాలిక ల కేటగిరీల వారీగా ఒక్కో సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు. జనరల్‌ సంఘాల్లో పది మంది సభ్యులు ఉండగా, దివ్యాంగులు, వృద్ధ మహిళలు, కిశోర బాలికలతో కూడిన సంఘాల్లో ఐదు నుంచి పది మంది వరకు ఉండనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించిన సెర్ప్‌ డీపీఎం, ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు,వీవో ఓబీలు ఆయా వర్గాల వారి ని గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా కిశోర బాలికలు 4,133, వృద్ధ మహిళలు 3,570, దివ్యాంగులు 1,516, జనరల్‌ మహిళలు 6,412 మందిని గుర్తించారు. వీరిలో బ్యాంకు ఖాతాలు కలిగిన వారి వివరాలు సేకరిస్తుండగా, అవి లేనటువంటి వారికి కొత్తగా ఖాతాలు తెరిపిస్తున్నారు.

లక్ష్యసాధన దిశగా ..

కిశోర బాలికలు, వృద్ధ మహిళలు, దివ్యాంగులు, జనరల్‌ మహిళా సభ్యులతో కూడిన స్వయం సంఘాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆయా వర్గాల వారిని గుర్తిస్తూ సభ్యులుగా చేర్పిస్తున్నాం. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నాం.

– రమాకాంత, డీపీఎం ఐబీ

జిల్లాలో..

ప్రస్తుతం ఉన్న ఎస్‌హెచ్‌జీలు 1103

ఆయా సంఘాల్లోని సభ్యులు 121514

కొత్త ఎస్‌హెచ్‌జీల లక్ష్యం, ఇతర వివరాలు

మొత్తం వీవోలు 554

ఏర్పాటు చేయాల్సిన ఎస్‌హెచ్‌జీలు 2,216

ఆయా సంఘాల్లో చేర్చాల్సిన సభ్యులు 19,390

ఇప్పటి వరకు గుర్తించిన సభ్యులు 12,246

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement