రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి | - | Sakshi
Sakshi News home page

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

Oct 13 2025 8:38 AM | Updated on Oct 13 2025 8:38 AM

రైతుల

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

కాంగ్రెస్‌లో మొదలైన సందడి నేడో, రేపో ఏఐసీసీ పరిశీలకుడి రాక పీసీసీ నుంచి ముఖ్య నేతల కోఆర్డినేషన్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయ సేకరణ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

బతుకమ్మ సంబురం

బతుకమ్మతో చిన్నారి

జిల్లాలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. తాంసి, తలమడుగు మండలాల్లో శనివారం పూల వేడుకలు అంబరా న్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను గద్దెల వద్ద ఉంచి ఉయ్యాల పాటల నడుమ ఆడబిడ్డలు చప్పట్లతో సందడి చేశారు. అనంతరం డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా బయలుదేరి పోయిరా బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. పూల సింగిడిని సమీపంలోని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేశారు. తాంసి, హస్నాపూర్‌, పొన్నారి గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. తాంసిలోని హనుమాన్‌ ఆలయం వద్ద మహిళలు సామూహికంగా ఆడి అలరించారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవాపూర్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆడబిడ్డలు భారీగా పాల్గొన్నారు. – తాంసి/తలమడుగు

సాక్షి,ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌లో మళ్లీ డీసీసీ అధ్యక్షుడి నియామక వేడి మొదలైంది. ఏఐసీసీ నుంచి పరిశీలకుడు రానున్నారు. నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. పీసీసీ ముఖ్య నేతలు ఆయనతో సమన్వయం చేయనున్నారు. నేడో, రేపో వారు జిల్లాకు రానున్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీలో ప్రక్రియ జరిగినప్పటికీ ముందడుగు పడకపోవడం గమనార్హం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ నుంచి పరిశీలకుడి రాక ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉమ్మడి జిల్లాలో..

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ నుంచి 22 మందితో పరిశీలకులను నియమించారు. వారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో సర్వేకోసం ఇప్పటికే పరిశీలకులు వచ్చేశారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సర్వే కోసం ఏఐసీసీ నుంచి మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే అజయ్‌సింగ్‌ను నియమించారు. ఆయనతో పాటు పీసీసీ నుంచి రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, ప్రధాన కార్యదర్శులు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, సీహెచ్‌.రాంభూపాల్‌ కోఆర్డినేషన్‌ చేయనున్నారు. కాగా ఈ రెండు జిల్లాల్లో వారు బ్లాక్‌స్థాయిలో కార్యకర్తలతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అంతే కాకుండా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ప్రస్తుతం ప్రక్రియ గట్టిగానే సాగుతుందనే చర్చ వినిపిస్తోంది.

ఆసక్తికరం..

కాంగ్రెస్‌లో ఏఐసీసీ నుంచి నేరుగా పరిశీలకులు రావడం, డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించనుండటంతో పార్టీలో ఇది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా బ్లాక్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను కలిసి వారి అభిప్రాయం సేకరించనుండటంతో ఇప్పుడు ఆశావహుల్లో టెన్షన్‌ కనిపిస్తోంది. కేవలం కార్యకర్తల నుంచే కాకుండా వ్యాపారులు, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులను కూడా కలిసి అభిప్రాయ సేకరణ చేయనున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో ఆశావహులు ఎవరినైనా మేనేజ్‌ చేసి తమ పేరును పరిశీలకుడి ముందు గట్టిగా చెప్పించాలనుకునే ప్రయత్నాలకు ఎక్కడ కూడా అవకాశాలు ఉండకపోవచ్చని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఈ కమిటీలకు పార్టీలో ముందుగానే శిక్షణ ఇచ్చి అభిప్రాయ సేకరణ ఏ విధంగా చేపట్టాలని పార్టీ దిశానిర్దేశం చేసిందని పేర్కొంటున్నారు. దీంతోనే ఈ ప్రక్రియపై ఇప్పుడు పార్టీలో అందరి దృష్టి నెలకొంది.

జిల్లా పరిశీలకుడిగా రానున్న అజయ్‌ సింగ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: రైతులు స్వయం సమృద్ధి సాధించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీ గోడం నగేశ్‌ అన్నా రు. రూ.42 వేల కోట్లతో దేశ వ్యాప్తంగా చేపట్టిన ధన్‌ధాన్య పథకాన్ని ప్రధాని శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆలకించిన అనంతరం ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. దేశంలోని రైతులు స్వయం సమృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ధన్‌ ధాన్య పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. సాంకేతికత ఉపయోగిస్తూ రైతులు తమ పంట దిగుబడులను ఎగుమతి చేసేలా తయారు చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేవీకే ప్రొగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.రాంగోపాల్‌వర్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌స్వామి, మార్కెటింగ్‌ అధికారి గజానంద్‌, ఉద్యాన అధికారి నర్సయ్య, కేవీకే శాస్త్రవేత్తలు రఘువీర్‌, సురేష్‌,శివచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుకు సిద్ధమవుతున్న ఆశావహులు..

ప్రధానంగా ఇది వరకే పీసీసీ దృష్టిలో ఉన్న జా బితాలోని పేర్ల ఆధారంగా ఏఐసీసీ పరిశీలకులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారని చెబు తున్నారు. పదవీ ఆశిస్తున్న నేతలు కూడా పరి శీలకులకు దరఖాస్తులను అందించేందుకు సిద్ధ మవుతున్నారు.ప్రధానంగా ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్ష పదవిని ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గోక గణేశ్‌ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు నరేష్‌ జాదవ్‌, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడె గజేందర్‌ ఆశిస్తున్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతుంది. తనకు అవకాశం ఇవ్వాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు కూడా దరఖాస్తు అందించేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ సోయం బాపూరావు కూడా డీసీసీ అధ్యక్ష పదవీని ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పీఠం కోసం కార్యకర్తలు ఎవరి పేరును సూచిస్తారనేది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి1
1/8

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి2
2/8

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి3
3/8

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి4
4/8

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి5
5/8

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి6
6/8

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి7
7/8

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి8
8/8

రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement