
4 కి.మీ కాలినడకన వెళ్లి.. వైద్యం అందించి
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. మండల వైద్యాధికారి సర్ఫరాజ్, సిబ్బంది 4 కి.మీ కాలినడకన వెళ్లి శనివారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యపరీక్షలు చేసి మాత్రలు అందజేశారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సర్ఫరాజ్ మాట్లాడుతూ గ్రామంలో 11 ఇళ్లు ఉండగా, 64 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడితే వెంటనే పీహెచ్‌సీకి, రిమ్స్‌కు వెళ్లి చికిత్స చేసుకోవాలన్నారు. అంకోలి పీహెచ్‌సీ హెల్త్ సూపర్ వైజర్ బొమ్మేత సుభాష్, హెల్త్ అసిస్టెంట్స్ వేణుతాయి, పవర్ ప్రేమ్‌సింగ్, రాథోడ్ నారాయణ, ఆశకార్యకర్తలు సుమిత్ర, రుక్మిణి, దుర్పత బాయి, గ్రామస్తులు ఉన్నారు.