
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు వేసి బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. సుధీర్ఘ పోరాటం తరువాత ప్రభుత్వం 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తే అడ్డుకో వడం సరికాదు. బీసీలకు పదవులు వస్తుంటే ఓ ర్వలేకపోతున్నారు. రాజకీయంగా అణిచివేసేందుకే ఇదంతా చేస్తున్నారు. మాకు రావాల్సిన వాటా దక్కే వరకు ఉద్యమిస్తాం. – కరిపే
శ్రీనివాస్, వంజరి సంఘం అధ్యక్షుడు, బోథ్
బీసీలు నష్టపోతున్నారు
23 శాతం రిజర్వేషన్‌తో బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం 42 శాతం పెంచితే ఆనందపడ్డాం. జనాభాకు తగ్గట్టు ఫలాలు అందుతాయని ఆశపడ్డాం. కానీ కొందరు కోర్టులో కేసు వేసి మా నోటికాడ ముద్ద లాక్కున్నారు. జనాభా ప్రాతిపదికన మా వాటా మాకు దక్కాల్సిందే. – కలాల శ్రీనివాస్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు