గురుకులాలపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

గురుకులాలపై ఫోకస్‌

Oct 13 2025 8:38 AM | Updated on Oct 13 2025 8:38 AM

గురుకులాలపై ఫోకస్‌

గురుకులాలపై ఫోకస్‌

ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా పీఎస్‌ఆర్‌.శర్మ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఇప్పటికే ప్రిన్సిపాళ్లతో సమావేశం చదువుతోపాటు మెనూ అమలుకు కసరత్తు

ఆదిలాబాద్‌టౌన్‌: సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుంది. గురుకులాల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పది జి ల్లాలకు పది మంది ప్రత్యేకాధికారులను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రెటరీ పీఎస్‌ఆర్‌.శర్మ నియమితులయ్యారు. రెండు రోజు ల క్రితం జిల్లాకు వచ్చిన ఆయన ఉమ్మడి జిల్లా పరి ధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల ప్రి న్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఫుడ్‌ పాయిజన్‌, విద్యార్థుల రక్షణపరంగా చర్యలతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించడం, పెండింగ్‌ అద్దెబిల్లులు వంటి సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో..

జిల్లాలో నాలుగు సాంఘిక సంక్షేమ గురుకుల వి ద్యాసంస్థలున్నాయి. పట్టణంలో బాలికల పాఠశా ల, జూనియర్‌ కళాశాల అలాగే బాలికల డిగ్రీ కళా శాల, ఇచ్చోడలో బాలుర కళాశాల, బోథ్‌లో బాలిక ల డిగ్రీ కళాశాల ఉంది. ఒక్కో పాఠశాల/కళాశాలలో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ కళాశాలలో 480 మంది చదువుతున్నారు. జిల్లాలో మొత్తం 2,400 మంది విద్యార్థులున్నారు.

సమస్యల పరిష్కారంపై దృష్టి

ఇటీవల గురుకుల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ఆదిత్య సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన బో ర్డులో పలు సంస్కరణలు తీసుకువచ్చారు. తాజా గా గురుకులాలపై ఫోకస్‌ పెట్టారు. ఈ ఏడాది మే నుంచి అద్దె భవనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో యజమానులు భవనాలను ఖాళీ చేయాలని ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దృష్టి సారించిన ఆయన కళాశాలల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 50మంది వరకు పార్ట్‌ టైం టీచర్లు, లెక్చరర్స్‌గా పనిచేస్తున్నారు. అలాగే 30 మంది సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌ ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా వీరికి వేతనాలు రావడం లేదు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సదరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం..

గురుకుల కళాశాలల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఫోకస్‌ పెట్టా రు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూ ప్ర కారం విద్యార్థులకు పౌష్టికాహరంతో కూడిన నాణ్య మైన భోజనం అందించే దిశగానూ దృష్టి సారిస్తున్నారు. ఈ విషయమై గురుకులాల జోనల్‌ అధికారి అరుణ కుమారిని సంప్రదించగా.. ఇటీవల మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఉమ్మడి జిల్లా ప్రిన్సి పాళ్లతో ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సమావేశం నిర్వహించారని తెలిపారు. పలు అంశాలపై వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. అలాగే సమస్యలపై ఆరా తీసినట్లుగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement