
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
మందమర్రిరూరల్: గంజాయి రవాణా చేస్తున్న ము గ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. కాగజ్‌నగర్ నుంచి గంజాయి తీసుకువస్తున్నారనే సమాచారంతో జాతీయ రహదారి టోల్‌గోట్ వద్ద తనిఖీ చేపట్టారు. స్కూటీపై వచ్చిన ముగ్గురిని తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని స్కూటీతోపాటు వేల్పుల వర్శిత్ (పొన్నారం), వేల్పుల రాహుల్ (ఆదిల్‌పేట్), మణిదీప్ (నస్పూర్)ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.