
యూరియా కష్టాలు
సాత్నాల: రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. మండలంలోని మెడిగూడ(ఆర్) గ్రామ సహకార సంఘ కార్యాలయానికి స్టాక్ వచ్చిందనే సమాచారంతో రైతులు సోమవారం వేకువజామునే చేరుకున్నారు. గంటల తరబడి బారులు తీరి నిరీక్షించారు. కాగా, 444 బ్యాగుల ఎరువును పంపిణీ చేసినట్లు ఏవో జాదవ్ కై లాస్ తెలిపారు.
రైతులకు సరిపడా అందజేయాలి
భీంపూర్: రైతులకు సరిపడా యూరియా అందజేయాలని కోరుతూ మండల కేంద్రంలో రైతులు సో మవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశా రు. యూరియా కొరతకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం అని ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్సై పీర్ సింగ్ నాయక్, ఏవో శ్రీనివాస్‌రెడ్డి రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
బేల: మండలకేంద్రంలోని డోప్టాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అన్నదాత కృషి కేంద్రం వద్ద సోమవారం వేకువజాము నుంచే రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండేసి చొప్పున 888 యూరియా బ్యాగులు పంపిణీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గంటల తరబడి నిరీక్షించినా పలువురు రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.