
రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఎంజేపీ విద్యార్థులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జోనల్ స్థాయి ఈత పోటీల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అండర్–17 విభాగంలో బ్యాక్‌స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అంశాల్లో పదోతరగతి చదువుతున్న ఎస్.అరవింద్, అండర్–17 విభాగంలో బ్యాక్‌స్ట్రోక్ అంశంలో తొమ్మిదోతరగతి చదువుతున్న టి.అభిరామ్, అండర్–14 విభాగంలో ఫ్రీ స్టైల్ అంశంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బి.హర్ష ఎంపికయ్యారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. సదరు విద్యార్థులను ఎంజేపీ ఉమ్మడి జిల్లా ఆర్‌సీఓ, ప్రిన్సిపాల్ సేరు శ్రీధర్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి, ఫిజికల్ డైరైక్టర్ సురేశ్, పీఈటీ నగేశ్, అధ్యాపక బృందం అభినందించారు.