
బాసర ఆర్జీయూకేటీలో ఇంజినీర్స్ డే
బాసర: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం బాసర ఆర్జీయూకేటీలో ఇంజినీర్స్ డే నిర్వహించారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల అధిపతులు పాల్గొని విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ చాన్స్‌లర్ గోవర్ధన్ మాట్లాడుతూ కళాశాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడానికి అవసరమైన అన్ని రకాల అధునాతన లాబొరేటరీస్ అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎస్టీపీపీలో...
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో సోమవారం ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిన్ భవన కార్యాలయంలో భారతదేశ తొలి ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ నేడు ప్రతీపని ఇంజినీరింగ్‌తో ముడిపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం నరసింహారావు, సీఎంవోఏఐ బ్రాంచ్ సెక్రెటరీ సంతోశ్‌కుమార్, ఏజీఎంలు మురళీధర్, శ్రీనివాస్, అజాజుల్లాఖాన్, పంతులా, కిరణ్‌బాబు, పాల్గొన్నారు.

బాసర ఆర్జీయూకేటీలో ఇంజినీర్స్ డే