
పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య
లక్సెట్టిపేట: పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుఉంది. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని హన్మంతుపల్లె గ్రామానికి చెందిన జెడ కిష్టయ్య (36) కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం పంట పొలాలకు అవసరమయ్యే పురుగు మందులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లగా అవసరం ఉన్నదానికంటే ఎక్కువ ఎందుకు తీసుకువచ్చావని అతని రెండో భార్య లక్ష్మి మందలించింది. అప్పటికే అతను మద్యం మత్తులో ఉండటంతో ఇద్దరు గొడవపడ్డారు. దీంతో ఆమె గ్రామంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లింది. సోమవారం ఇంటికి వచ్చి చూసే సరికి కిష్టయ్య వాంతులు చేసుకుంటున్నాడు. పురుగుల మందుతాగానని చెప్పడంతో వెంటనే ముందుగా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని సోదరుడు లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.