
ఆరోగ్యంగా ఉంటేనే శిక్షణలో రాణింపు
ఆదిలాబాద్: ఎన్‌సీసీ కేడెట్లు ఆరోగ్యంగా ఉంటేనే శిక్షణలో రాణించడం సాధ్యపడుతుందని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వీపీ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీటీసీలో కొనసాగుతున్న ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం నాలుగో రోజుకు చేరుకుంది. కేడెట్లకు ఆరోగ్యం, పరిశుభ్రతపై వైద్యులతో శనివారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రషీద్ అన్సారీ, వైద్యులు సంతోష్ ఆదిత్య, ఆమీ, తేజస్విని ఆరోగ్యం, ఎన్‌సీసీ అధికారులు అశోక్, రజిత, లక్ష్మణ్, భూమన్న, మధురావ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.