నమ్మకమైన మోసాలు! | - | Sakshi
Sakshi News home page

నమ్మకమైన మోసాలు!

Sep 14 2025 3:05 AM | Updated on Sep 14 2025 3:05 AM

నమ్మకమైన మోసాలు!

నమ్మకమైన మోసాలు!

● నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) ఎస్‌బీఐలో గోల్డ్‌అప్రైజల్‌గా పని చేస్తున్న వ్యక్తి తనకు తెలిసిన 12 మంది పేరుతో నాణ్యత లేని బంగారాన్ని తనఖా పెట్టించి పనిచేస్తున్న బ్యాంకునే మోసం చేశారు. బ్యాంకులో మొత్తం రూ.20 లక్షలకు పైగా రుణాలకు అవకతవకలకు పాల్పడ్డారు. ఆడిట్‌లో ఈ మోసం బయటపడడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ● చెన్నూర్‌ ఎస్‌బీఐ 2 బ్రాంచిలో పనిచేస్తున్న క్యాషి యర్‌ బ్యాంకులో ఖాతాదారులు కుదవపెట్టిన 20 కిలోల బంగారాన్ని తనకు తెలిసిన వారికి ఇచ్చి ప్రైవేటు రుణసంస్థల్లో పెట్టించి అక్రమంగా రుణాలు పొందాడు. కేసు విచారణలో పోలీ సులు రూ.1.10 కోట్ల నగదుతో పాటు 20 కిలో ల బంగారం రికవరీని ప్రారంభించారు. దీంతో బ్యాంకులో కుదవ పెట్టిన ఖాతాదారుల బంగారంతో పాటు పలు ప్రైవేటు రుణ సంస్థలు చిక్కుల్లో పడ్డాయి.

తాకట్టు బంగారంతో కనికట్టు బ్యాంకుల్లోనే చేతివాటం.. ఉమ్మడి జిల్లాలో వెలుగులోకి కొత్త నేరాలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుత్తడి ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో మోసాలు సైతం అదే తీరుగా పెరుగుతున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో వెలుగులోకి వచ్చిన మోసాలతో సర్వత్రా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమేర్పడింది. ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కొందరు బ్యాంకు ఉద్యోగుల తీరుతో ఆయా సంస్థల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారంపై రుణాలు పొందాలన్నా, రుణ సంస్థలపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారంతో పాటు విలువైన ఆస్తులు, బ్యాంకుల్లో తనఖా పెట్టేముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కొన్నిచోట్ల మోసం ఆదిలోనే బయటపడుతుండగా మరికొన్ని చోట్ల నెలల తరబడి జరుగుతోంది.

నమ్మకమున్న చోటనే..

ప్రజల్లో బ్యాంకులపై నమ్మకానికి మారుపేరుగా విశ్వాసం ఉంది. అయితే కొంతమంది సిబ్బంది తప్పటడుగులతో అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. సాధారణంగా బ్యాంకులు, ప్రైవేటు రుణసంస్థల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగదు, బంగారం వంటి లావాదేవీల్లో క్షుణ్ణంగా పరిశీలనలు, తనిఖీలు ఉంటాయి. ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ప్రతీస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుంది. అంతేకాక కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంటుంది. లావాదేవీల విషయంలో ప్రతీది అత్యంత భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే అలాంటి నమ్మకున్న చోటనే ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.

అప్రమత్తమైన బ్యాంకులు, సంస్థలు

చెన్నూర్‌ ఎస్‌బీఐ బ్రాంచి–2 వ్యవహారంతో బ్యాంకర్లు, రుణసంస్థలు అప్రమత్తమై తమ సంస్థల్లోని అన్ని బ్రాంచీల్లో బంగారం నిల్వలు, రుణాల లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ ఆడిట్‌లతో పాటు ఈ ఘటనల తర్వాత ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖాతా దా రులు సైతం కుదవపెట్టిన బంగారం, రుణాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడికక్కడ రుణాలపై క్షుణ్నంగా పరిశీలనలు చేస్తూ తమసంస్థల పరిధిలో ఉన్న సిబ్బందిపైనా కఠిన పర్యవేక్షణ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

ఇటీవల జరిగిన ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement