
బదిలీలకు వేళాయె
ఎకై ్సజ్, వాణిజ్య, రిజిస్ట్రేషన్ శాఖల్లో.. ప్రభుత్వం నుంచి జీవో జారీ సుదీర్ఘకాలం ఒకే చోట ఉన్నవారికి స్థానచలనం
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే శా ఖల్లో బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖల్లో విధి విధానాలు రూపొందిస్తున్నారు. త్వరలో జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఎౖక్సైజ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో బది లీలకు రంగం సిద్ధమవుతుంది. ఒకే చోట సుదీర్ఘకా లం పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించనున్నా రు. సాధారణ బదిలీల సమయంలో అప్పట్లో అన్ని శాఖల్లో బదిలీలు చోటు చేసుకున్నాయి. అయితే స ర్కారుకు ఆదాయాన్నిచ్చే ఈమూడు శాఖలను మిన హాయించారు. తాజాగా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా వీరి బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆయా శాఖల్లో ఇలా..
ఎకై ్సజ్ శాఖలో సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న ఎస్సైలకు సంబంధించిన జాబితా తయారు చేయాలని ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మౌ ఖికంగా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో రెండేళ్లకుపైబడి ఒకే చోట పనిచేస్తున్న వారి వివరాలను అధి కారులు సేకరిస్తున్నారు. అలాగే కానిస్టేబుళ్లకు సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తున్న ట్లు చెబుతున్నారు. వీరితో పాటు ఉన్నతాధికారుల బదిలీలు కూడా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇక రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లతో పాటు ఉద్యోగుల బదిలీలు సైతం ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ పోస్టుల్లో ఇతర ప్రాంతాల నుంచి అధికారులు ఇక్కడకు వస్తారా లేదా అనేది చూడాల్సిందే. ఇక వాణిజ్యపన్నుల శాఖలోనూ బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. ఈ విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌చార్జి డీఆర్ ప్రసన్నను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడినప్పటికీ శాఖాపరంగా రావాల్సి ఉందని, ఆ తర్వాతే ఏయే క్యాడర్ ఉద్యోగుల బదిలీలు ఉంటాయనేది స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.