
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జోనల్ స్థాయి పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆడే రామేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన జోనల్‌స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. అండర్–14, 17 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల వేదిక ఇంకా ఖరారు కాలేదని, అయినప్పటికీ క్రీడాకారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు రాష్ట్రపాల్ తదితరులు పాల్గొన్నారు.