
రాజీ మార్గంతో కేసుల సత్వర పరిష్కారం
ఆదిలాబాద్‌టౌన్: రాజీ మార్గం ద్వారానే కేసుల స త్వర పరిష్కారం సాధ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి అవకాశముందన్నారు. సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. రాజీ పడే కేేసులను, సంబంధిత సంస్థలు, వ్యక్తులతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం పలు కేసులను అప్పటికప్పుడు పరిష్కరిస్తూ తీర్పు ప్రతులను ఇరుపక్షాలకు అందజేశారు. ఇందులో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, జడ్జిలు కుమార్ వివేక్, శివరాం ప్రసాద్, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, పీపీలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
బోథ్‌లో..
బోథ్: మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించా రు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజీమార్గమే రాజ మార్గమని అన్నారు. అనంతరం నూతన కోర్టు భవనాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బోథ్ జూని యర్ సివిల్ జడ్జి కె.సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 34 క్రిమినల్ కేసులు, ఒక సి విల్ తగాదా, నేరం ఒప్పుకోవడం ద్వారా 22, ఎకై ్స జ్ కేసులు 60, క్రిమినల్, ఎస్టీసీ కేసులు 429 పరి ష్కారమైనట్లు తెలిపారు. అలాగే ఇచ్చోడ, బోథ్ ఎస్బీఐలకు సంబంధించి 32 కేసులు పరిష్కరించడంతో పాటు రూ.46 లక్షలు రికవరీ అయినట్లు పే ర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీపీ శ్రీధర్, లోక్ అదాలత్ బెంచ్ మెంబెర్స్ హరీశ్, గంగసాగర్, న్యాయవాదులు అంగద్ కేంద్రే, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.
జిల్లాలో 15,357 కేసులు పరిష్కారం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో జాతీయ లోక్ అదా లత్ ద్వారా 15,357 కేసులు పరిష్కారమయ్యా యి. అలాగే రాష్ట్రస్థాయిలో జిల్లాకు 20వ స్థా నం లభించింది. పరిష్కారమైన వాటిలో 18 సివిల్, 3,480 క్రిమినల్, 11,759 ప్రిలిటిగేషన్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.