
అంగన్‌వాడీల పై పట్టింపు కరువు
ఆదిలాబాద్‌టౌన్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవ డం లేదని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి అన్నారు. ఏఐటీయూసీ అనుబంధ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహాసభలను పట్టణంలోని యాద వ సంఘ భవనంలో శనివారం నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలు, సాధించుకున్న హక్కులు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అహర్నిశలు పనిచేస్తున్న అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించ డం సరి కాదన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.