
‘సాత్నాల’ పరవళ్లు..
దిగువకు వెళ్తున్న
వరదనీరు
సాత్నాల: మండలంలోని సాత్నాల ప్రాజెక్టుకు శుక్రవారం 2,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ఈ మేరకు రెండు గేట్లు ఓపెన్ చేసి 2,380 క్యూసెక్కులను దిగువకు వదిలినట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.24 టీఎంసీ కాగా, ప్రస్తుతం 1.046 టీఎంసీగా ఉన్నట్లు వెల్లడించారు.
ఉరకలేస్తున్న వరద నీరు
దూకిన ‘మత్తడి’
తాంసి: మండలంలోని వడ్డాడి సమీపంలో గల మత్తడివాగు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. శుక్రవారం ఇన్‌ఫ్లో 1494 క్యూసెక్కులు ఉండగా ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో ఔట్‌ఫ్లో దిగువకు వదిలినట్లు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు. ప్రస్తుతం 277 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉండేలా స్థిరీకరిస్తున్నట్లు వెల్లడించారు.

‘సాత్నాల’ పరవళ్లు..

‘సాత్నాల’ పరవళ్లు..