
గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
గుడిహత్నూర్: ఆదిలాబాద్‌ను గంజాయి రహిత జి ల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ అఖి ల్ మహజన్ అన్నారు. మండలంలోని తోషం గ్రా మ శివారులో పట్టుకున్న గంజాయి మొక్కలకు సంబంధించి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీఎస్, ఇచ్చోడ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి తోషం శివారులో మర్సకోల దేవురావు అనే రైతు చేనులో పత్తిలో అంతర పంటగా సాగు చేస్తున్న 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.62.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు. గంజాయి సాగు, విక్రయాలపై పోలీసులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు వారికి రివార్డు అందజేస్తామన్నారు. అనంతరం ఆయన స్థానిక ఠాణాలో రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, సీసీఎస్ సీఐ పి.చంద్రశేఖర్, ఇచ్చోడ సీఐ రాజు, ఎస్సై శ్రీకాంత్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
నార్నూర్‌లో ఒకరి అరెస్టు..
నార్నూర్: గంజాయి సాగు చేస్తున్న ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గాదిగూడ మండలం పర్సువాడ పంచాయతీ పరిధిలోని సారుగూడకు చెందిన మార్సుకోల జంగు తన పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. ఈమేరకు గురువారం సాయంత్రం దాడులు జరిపి 16 మొక్కలను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.