యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను కూడా రైతులు వినియోగించాలి. దీనిపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం మొక్కల ఎదుగుదలకు యూరియా, పొటాషియం కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా పూత, కాత దశలో పంట ఎదుగుదలకు తోడ్పడుతుంది.
– డాక్టర్ మోహన్‌దాస్, శాస్త్రవేత్త,
వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్
స్టాక్ వచ్చేది ఉంది..
జిల్లాలో యూరియా కొరత లేదు. ప్రస్తుతం స్టాక్ వచ్చేది ఉంది. రైతులు అవసరం మేర తీసుకుంటే సమస్య ఏర్పడే పరిస్థితి ఉండదు. అంతకుమించి అదనంగా అడగడంతోనే సమస్యలు వస్తున్నాయి. అయినప్పటికీ జిల్లాకు స్టాక్ వచ్చేది ఉంది.
– శ్రీధర్‌స్వామి,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
నానో యూరియా వినియోగించాలి..