
దేశభక్తిని పెంపొందించే వేదిక ఎన్‌సీసీ
ఆదిలాబాద్: ఎన్‌సీసీ యువతలో దేశభక్తిని పెంపొందించే వేదిక అని ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్
కల్నల్ విక్రమ్ ప్రతాప్‌సింగ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 32 తెలంగాణ బెటాలియన్ 3వ వార్షిక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిక్షణ ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. డిప్యూటీ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ కిచ్చార్ మాట్లాడుతూ ఈ శిబిరంలో ప్రతిరోజు పీటీ, డ్రిల్, ఫైరింగ్, ఆప్టికల్ గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు లెఫ్టినెంట్ గాలి అశోక్, లెఫ్టినెంట్ రజిత, లెఫ్టినెంట్ పుట్ట లక్ష్మణ్, లెఫ్టినెంట్ బెల్లం భూమన్న, మధు రావు, రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.