
జిల్లాలో భారీ వర్షం
కై లాస్‌నగర్/సాత్నాల: ఆదిలాబాద్ జి ల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి గురువా రం వేకువజామున ఐదు గంటల వర కు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 1043.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల నీ టిని విడుదల చేయడంతో తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా అక్కడి తాత్కాలిక వంతె పై నుంచి రాకపోకలను నిలిపివేశారు. అత్యధికంగా బేల మండలంలో 57 మిల్లీమీటర్లు, నార్నూర్‌లో 46, ఆదిలాబాద్‌లో 42, గాదిగూడలో 36.3, జైనథ్‌లో 15, ఉట్నూర్‌లో 11.5, భోరజ్‌లో 7.5, ఆది లాబాద్ రూరల్‌లో 4.5, సిరికొండలో 2, మావల, సోనాలలో .5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.