
యూరియా.. తిప్పలు
ఇచ్చోడ/ఉట్నూర్‌రూరల్: ఈ ఏడాది రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సహకార సంఘాలకు ఎరువు స్టాక్ వచ్చిందని తెలిస్తే చాలు వేకువజామునే అక్కడికి చేరుకుంటున్నా రు. గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్నారు. ఇచ్చోడ, ఉట్నూర్ మండల కేంద్రాల్లోని సహకార సంఘ కార్యాలయాల ఎదుట బుధవారం ఉదయం నుంచే బారులు తీరి దర్శనమిచ్చా రు. ఇచ్చోడలో 444 బ్యాగులు రాగా చాలామంది ఎరువు లభించక నిరాశతో వెనుదిరిగారు. యూరియా కొరతను నిరసిస్తూ ముఖరా(కే) లో మాజీ సర్పంచ్ మీనాక్షి ఆధ్వర్యంలో భిక్షాటన చేసి వినూత్న నిరసన తెలిపారు. ఉట్నూర్‌లోని పీఏసీఎస్ కార్యాలయానికి ఉదయాన్నే సుమారు 200 మంది రైతులు తరలిరాగా రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.