
పోరాట ఫలితమే సీసీఐపై కదలిక
ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ పునఃప్రారంభించాలని మూడేళ్లుగా సీసీఐ సాధన కమిటీ నిర్విరామంగా పోరాటం చేసిందని సాధన కమిటీ కన్వీనర్ దర్శనా ల మల్లేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాట ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల్లో కదలిక వచ్చిందన్నారు. సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీకి వెళ్లి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసినట్లు తెలిపారు. సీసీఐని ప్రభుత్వ సంస్థగానే కొనసాగించాలని, కేంద్రం ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నా రు. త్వరలోనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిని కలవనున్నట్లు తెలిపారు. ఇందులో ఇజ్జగిరి నారా యణ, రమేశ్, దత్తాత్రి, వెంకటనారాయణ, జగన్‌సింగ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.