
కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం
కైలాస్‌నగర్: తన రచనల ద్వారా ప్రజా హక్కుల కోసం ఉద్యమించిన పోరాటయోధుడు కాళోజీ నారాయణరావు అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతిని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికా రికంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులు, ఉద్యోగులతో కలిసి ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. తెలంగాణ మాండలికానికి కాళోజీ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, జిల్లా సహకార అధికారి మోహన్, సీపీవో వెంకటరమణ, కలెక్టరేట్ ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు.