
రిమ్స్‌లో ‘క్యాన్సర్ డే కేర్’ సేవలు
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని డైరెక్టర్ జైసింగ్ రా థోడ్ అన్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ క్యాన్స ర్ బాధితులకు రిమ్స్‌లో కిమో థెరపీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. బాధితులు సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ చందు, దీపక్ పుష్కర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.