
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నాందేడ్ రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రదీప్ కామ్లేకు తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ విన్నవించారు. సోమవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. పిట్‌లైన్ పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం పూర్తి కాలేదన్నారు. అలాగే రైల్వేఅండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీటిపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, అధ్యక్షుడు సంతోష్, సుభా ష్ జాదవ్, అమర్ జార్జ్ తదితరులున్నారు.