
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: ఫిర్యాదుల విభాగం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. 17 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.
ఎస్పీకి సన్మానం
జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్‌ను బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో స త్కరించారు. కృషిమిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు రాణాప్రతాప్ సింగ్, బ్రహ్మ సతీశ్, భావన, ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.