
ఐటీఐ గురువులకు రాష్ట్రస్థాయి అవార్డులు
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని ఐటీఐ కళాశాలకు చెందిన పలువురు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. సోమవారం హై దరాబాద్‌లోని రెడిల్స్‌లో ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆదిలా బాద్ ఐటీఐ ప్రిన్సిపాల్ పద్మ శ్రీనివాస్, ఉట్నూ ర్ ఐటీఐ ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్ ఉత్తమ ప్రి న్సిపాల్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఉ త్తమ ట్రైనర్లుగా ఉట్నూర్‌కు చెందిన పులి రాంచందర్, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లుగా మధుసూదన్, జగదీష్ అవార్డులు పొందారు. వీరికి రాష్ట్ర ఉపాధి కార్మిక శిక్షణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అవార్డులను ప్రదానం చేశారు.