
‘సీసీఐ’పై ఆశలు
ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు
హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
హాజరైన సీసీఐ సీఎండీ, స్థానిక ఎమ్మెల్యే శంకర్
కేంద్రం సానుకూలం..
ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం. ఫ్యాక్టరీ పునరుద్ధరణ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధితో పా టు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశముంది. ఈ క్రమంలోనే పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది.రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన వాటర్, ఎల క్ట్రిసిటి, ప్రాపర్టీ ట్యాక్స్ వంటివి రూ.15కోట్లు బకాయిపడ్డాయి. వాటి ని విడుదల చేయాల ని ఇటీవల మంత్రిశ్రీధర్‌బాబుతో మాట్లాడి కోరడం జరిగింది. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర భాగస్వామ్యంతో ఫ్యాక్టరీని తిరిగితెరిపిస్తాం.
– గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్
అన్ని అంశాలను దృష్టికి తీసుకెళ్లా..
జిల్లా కేంద్రంలో మూతప డ్డ సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి సానుకూలంగా ఉంది. సీసీఐ చైర్మన్ వి షయాన్ని స్పష్టంగా తెలిపారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఉన్న సానుకూలత, వనరులు, కలిగే ప్రయోజనాలను చైర్మన్‌తో పాటు ప్రభు త్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. త్వరలోనే మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి చర్చిస్తాం.
– ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సీసీఐ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజాగా ఆ సంస్థ సీఎండీ సంజయ్ బంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. పరిశ్రమ పునరుద్ధరణ ఆవశ్యకత, అందుబాటులో ఉన్న వనరులు, చేకూరే ఉపాధి వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. పరిశ్రమ పునరుద్ధరణకు అవసరమైన డీపీఆర్ సిద్ధం చేసి, త్వరలోనే ఢిల్లీ స్థాయిలో మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు జిల్లావాసుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి.
కేంద్రం ఆధ్వర్యంలోనే...
27 ఏళ్ల క్రితం మూతపడ్డ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం, ఆ దిశగా వరుస సమీక్షలు నిర్వహిస్తుండడంతో ఈ ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రతిపాదనలను పరిశీలించారు. పాత యంత్రాలు శిథిలావస్థకు చేరినందున అధునాతన యంత్రాలతో ప్లాంట్ పునరుద్ధరించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందుకు సుమారు రూ.2వేల కోట్ల వ రకు వ్యయం అవసరమవుతుందని యాజమాన్యం వెల్లడించినట్లుగా తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల భాగస్వామ్యంతో ముందుకు సాగాలా.. లేక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలా.. అలా కానిపక్షంలో పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలనే మూడు అంశాలపై ఇందులో చర్చించినట్లుగా సమాచారం. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మంత్రి శ్రీధర్‌బాబు తెలి పినట్లుగా తెలిసింది. పరిశ్రమ రీ ఓపెన్ అయితే ప్ర త్యక్షంగా సుమారు 3వేల మందికి పరోక్షంగా మరో ఐదారువేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. మరో వందేళ్ల పాటు అవసరమైన సున్నపురాయి నిల్వలు స్థానికంగా అందుబాటులో ఉన్నందున కేంద్రం ఆధ్వర్యంలోనే పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

‘సీసీఐ’పై ఆశలు

‘సీసీఐ’పై ఆశలు