
చేయూత పింఛన్ పెంచాలి
కై లాస్‌నగర్: చేయూత పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎ మ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రధానద్వారం ఎదుట నిరసన తె లిపిన ఆయా సంఘాల నాయకులు, దివ్యాంగులు పోలీసులను నెట్టుకుని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. మళ్లీ అడ్డుకోవడంతో కార్యాలయ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీడబ్ల్యూవో మిల్కా వారి వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే పింఛన్ పెంచుతామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది గడిచినా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రేంరాజ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘పోడు’ పట్టాలివ్వాలని సీపీఎం ధర్నా
గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు ప ట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి రాఘవులు,నాయకులు స్వామి, గంగారం పాల్గొన్నారు.
కొనసాగుతున్న 104 ఉద్యోగుల ఆందోళన..
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 104 సేవల ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన ఆందో ళన 7వ రోజుకు చేరింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఐదు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చె ల్లించాలన్నారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.మల్లేశ్ పాల్గొన్నారు.