
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాల ని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 68 అర్జీలు అందినట్లు అధికారులు వెల్ల డించారు. వాటిలో కొందరి నివేదిన..