
పునరావాసం కల్పించండి
1989లో అప్పటి సీఎం ఎన్టీఆర్ మాకు ఇళ్లు కట్టించారు. పదేళ్ల తర్వాత మా కాలనీని ఆనుకుని చెరువు కట్ట నిర్మించారు. ప్రారంభంలో ఇబ్బంది లేకున్నా పదేళ్లుగా అవస్థలు తప్పడం లేదు. కట్టబలహీనంగా మారడంతో వర్షాకాలంలో భయభయంగా గడుపుతున్నాం. మమ్ములను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఇంటిస్థలాలు మంజూరు చేసి పునరావాసం కల్పించేలా చూడాలని విన్నవించుకుంటున్నాం.
– జవహర్‌నగర్ కాలనీవాసులు, జజార్‌హత్నూర్
వేతనాలందక తిప్పలైతంది..
మేమంతా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులుగా సేవలందిస్తున్నాం. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నాం. అవి కూడా మూడు నెలలుగా చెల్లించడం లేదు. కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారింది. వేతనాలు త్వరగా మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నాం.
– స్వచ్ఛ కార్మికులు, ఆదిలాబాద్

పునరావాసం కల్పించండి