
పెండింగ్ వేతనాలు ఇప్పించండి
మేమంతా జిల్లాలోని వివిధ తహసీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాం. మాకు ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. వాటిని త్వరగా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.
– రెవెన్యూ శాఖ కంప్యూటర్ ఆపరేటర్లు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి
మేమంతా 40 ఏళ్లుగా గ్రామంలో కూలీనాలి చేసుకుంటూ నివసిస్తున్నాం. మాకు ఇంటి స్థలం తప్ప ఎలాంటి వ్యవసాయ భూములు కానీ, ఇండ్లు కానీ లేవు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నాం.
– కినార్‌పల్లి గ్రామస్తులు, బజార్‌హత్నూర్

పెండింగ్ వేతనాలు ఇప్పించండి