
‘సమస్యలు పరిష్కరిస్తా..’
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో టస్మా ఆధ్వర్యంలో శనివారం గురుపూజో త్సవం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరితో కలిసి ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులను సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వ పథకాలకు అర్హులేనన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని యాజ మాన్యాలకు సూచించారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పవన్‌రావు. కార్యదర్శి ఆధినాథ్, కోశాధికారి దేవేందర్ పటాస్కర్, అడ్వైజర్ పురుషోత్తం, కరస్పాండెంట్లు రమణ, స్వామి, హమీద్, రామకృష్ణ, షబ్బీర్ తదిత రులు పాల్గొన్నారు.