ఆదివాసీల సొంతింటి కల నెరవేరుస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల సొంతింటి కల నెరవేరుస్తాం

Sep 6 2025 5:13 AM | Updated on Sep 6 2025 5:13 AM

ఆదివాసీల సొంతింటి కల నెరవేరుస్తాం

ఆదివాసీల సొంతింటి కల నెరవేరుస్తాం

● ఎంపీ గోడం నగేశ్‌ ● ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

కైలాస్‌నగర్‌: ఆదివాసీల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని ఎంపీ గోడం నగేశ్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శు క్రవారం పీఎం జన్‌మన్‌ పథకం కింద ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని 359 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్‌ రాజర్షి షా, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఏ ఒక్క ఆదివాసీ పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం పీఎం జన్‌మన్‌ కింద ఇళ్లు మంజూరు చేస్తోందని చెప్పారు. కార్యక్ర మంలో డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, గ్రంథాల య సంస్థ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, జెడ్పీ సీఈ వో జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బేల మండల కేంద్రంలో..

బేల: మండలకేంద్రంలోని గణేశ్‌ గార్డెన్స్‌లో పీఎం జన్‌మన్‌ పథకం కింద బేల, సాత్నాల మండలాల కు చెందిన 1,008మంది పీవీటీజీ ఆదివాసీ లబ్ధిదా రులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పంపిణీ చేశారు. డీసీసీబీ చైర్మన్‌ భోజారెడ్డి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ బసవేశ్వరయ్య, జైనథ్‌ ఏఎంసీ చైర్మన్‌ అల్లూరి అశోక్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సవాపురే విలాస్‌, ఎంపీడీవోలు మహేందర్‌కుమార్‌, వెంకట్‌రాజు, తహసీల్దార్‌ రఘునాథ్‌రావు, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

ఇంద్రవెల్లి: పేదల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యే యమని, తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం పేద, మధ్య తరగతి కుటుంబాలకు నేరుగా లాభం జరుగుతుందని ఎంపీ గోడం నగేశ్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని హర్షిస్తూ మండలకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో పన్నుల భారంతో సామాన్యులు చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్టీ తగ్గింపు అమలులోకి రానుండగా ఇది దసరా, బతుకమ్మ, దీపావళి పండుగలకు పేదలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన బహుమానమని తెలిపా రు. కార్యక్రమంలో బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌, నాయకులు కేంద్రే బాలాజీ, ఆరెల్లి రాజలింగు, ఆర్క ఖమ్ము, శివకుమార్‌ జైస్వాల్‌, తుకారాం, హనుమంత్‌రావ్‌, రాజేశ్వర్‌, రాజువర్ధన్‌, దిలీప్‌, రాధిక, జైరాం తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement