
వినాయకా.. సెలవిక
ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్స వాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మి ది రోజుల పాటు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గురువారం మొదలైన నిమజ్జనోత్సవం శుక్రవారం ఉద యం వరకు కొనసాగింది. పెన్‌గంగ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం, భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది.
బజార్‌హత్నూర్: మండల కేంద్రంలోని సూర్య గణేశ్, శివాజీ మార్కెట్, శ్రీహనుమాన్, పోచమ్మ, మైసమ్మ, రామ్‌సేన్, గాంధీనగర్ యూత్‌ల ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండళ్ల వద్ద శుక్రవారం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన శోభాయాత్ర నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. యువకులు బ్యాండ్ మేళా, భాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ శోభాయాత్రగా వెళ్లారు. అనంతరం గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు.
ఇంద్రవెల్లి: మండలకేంద్రంతో పాటు మండలంలో ని గొండ్‌గూడ, పర్ధాన్‌గూడ, మిలింద్‌నగర్, ము త్నూర్ గ్రామాల్లో శుక్రవారం రాత్రి నిమజ్జనోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయా మండళ్ల వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు ని ర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యా రు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సంప్రదాయ వాయిద్యాలతో గణేశ్ విగ్రహాల శోభా యాత్ర నిర్వహించి అనంతరం నిమజ్జనం చేశారు.