
బోధనతోపాటు సేవల్లోనూ రాణిస్తూ..
సాత్నాల: భోరజ్ మండలం పిప్పర్‌వాడ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు శశికళ పాఠ్యాంశాల బోధనతోపాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు. చిత్రలేఖనం, కవిత్వం, కథా రచన, సైన్స్ మోడల్స్, వేదికపై ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం లాంటి అంశాల్లో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆమె మార్గదర్శకత్వంలో పలువురు విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలు, రాష్ట్ర సైన్స్ ఫెయిర్‌లో బహుమతులు గెలుచుకున్నారు. 130మంది విద్యార్థులున్న పాఠశాలలో అదనంగా మరో 45 మందిని చేర్పించారు. పాఠశాలలో వంటగదిని సొంత ఖర్చులతో నిర్మించారు. ఉదయం విద్యార్థులకు రాగి జావ అందిస్తారు. మధ్యా హ్న భోజనం కోసం విద్యార్థులకు దాతల ద్వా రా ప్లేట్లు ఇప్పించారు. కంప్యూటర్ బోధనకు అవసరమైన సామగ్రిని దాతల సాయంతో స మకూర్చారు. బడిలో మొక్కల పెంపకం, కూరగాయల సాగు చేపట్టారు. ఏడేళ్లుగా 100శాతం ఫలితాలు సాధిస్తుండడంతో ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపికై నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. 2020లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం, 2022లో స్వచ్ఛ విద్యాలయం కింద జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్నారు.