
బోధనోపకరణాలతో..
నిర్మల్‌రూరల్: సోన్ మండలం కడ్తాల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న హెచ్‌ఎం రాజులదేవి రమేశ్‌బాబు తక్కు వ ఖర్చుతో తయారుచేసిన బోధన ఉపకరణాలతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. రాతియుగపు పనిము ట్లు, సవరం, పడవ కరెన్సీ, అక్షర మాస్కులు, అక్షర కార్డులు, గుండె, మూత్రపిండాలు ఇలా రకరకాల బోధనోపకరణాలను తయారు చేసి బోధన చేస్తున్నాడు. పాఠ్యాంశంలోని విషయాలు క్షేత్ర పర్యటనల ద్వారా వారికి ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో జంక్ ఫుడ్ మాన్పించడానికి ప్రతి 2 నెలలకోసారి ఫుడ్ ఫెస్టివల్‌ను తల్లిదండ్రులతో కలిసి నిర్వహిస్తున్నారు. అప్పటి డీఈవో రామారావు ఆయన్ను అభినందించారు. విద్య రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను 2016లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2013లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది.