
వ్యర్థాలతో బొమ్మలు తయారు చేసి..
లోకేశ్వరం: సేవాలాల్‌తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్మల ప్రవీణ్‌కుమార్.. విద్యార్థులకు బొమ్మలతో విద్యాబోధన చేస్తున్నారు. కథనాలు, నాటికలు, పాఠ్యాంశాలు, క్లిష్టమైన గణిత భావనలను పప్పెట్ ద్వార బోధనతో వారిలో ఆసక్తి రేకిస్తున్నారు. వ్యర్థాలతో(ఉపయోగం లేని) బొమ్మలను విద్యార్థులతో తయారు చేయించి బోధన అందిస్తున్నారు. విద్యార్థులు స్వర మార్పులను గ్రహించి ఉపాధ్యాయున్ని అనుకరించి ఆటలు, కథల నాటికలో పాల్గొంటున్నారు. పప్పెట్ సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రెయినింగ్ (సీసీఆర్‌టీ) న్యూఢిల్లీలో శిక్షణ పొంది వచ్చి విద్యార్థులకు వాటి ద్వారా బోధిస్తున్నారు.