
ఒక విద్యార్థి నుంచి 30 మందికి..
నిర్మల్: మండలంలోని మల్లాపూర్‌కు అనుబంధ గ్రామమైన మా చాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయురాలు లక్ష్మి 2024 అక్టోబర్ 16న జాయిన్ అయింది. ఆ సమయంలో ఒక విద్యార్థి ఉన్నారు. బడి మూతపడటం ఖాయమనే సమయంలో విద్యార్థుల సంఖ్యను 30 మందికి చేర్చారు. ఆటపాటల ద్వారా బోధన, నేలపై పిల్లలతోపాటు కూర్చొని బోధించడటం లక్ష్మి ప్రత్యేకత. భీమేశ్ దాత సాయంతో రూ.40 వేలతో పాఠశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది. సొంత నిధులు రూ.25 వేల వెచ్చించి ఫర్నిచర్, కుర్చీలు, గ్రీన్‌నెట్, కిచెన్ గార్డెన్, ఆట వస్తువులు సమకూర్చింది. – లక్ష్మి, ఎస్జీటీ, మాచాపూర్ ప్రాథమిక పాఠశాల