
బోర్బుపై బొమ్మలు వేసి..
లక్ష్మణచాంద: మండలంలోని పీచర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు శ్వేత..బోధనోపకరణాలు వినియోగించి విద్య బోధించడం భోధనలో ప్రత్యేకత. విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా విద్య బోధిస్తున్నారు. వారంలో బోధించిన విషయాలపై ప్రతీ శనివారం పిల్లలు ఇంటికి చేరిన తరువాత వారి పోషకుల మొబైల్ ఫోన్‌లో టెస్ట్ మోజ్ అనే యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పిల్లలకు పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి అరగంటపాటు చిన్నచిన్న కథలను బోర్డుపై బొమ్మలు వేసి బోధిస్తున్నారు.
క్రీడల్లో శిక్షణ
నిర్మల్‌రూరల్: ఖానాపూర్ మండలం సత్తెనపల్లి జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఇమ్రాన్.. విద్యార్థులకు ఆటపోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల సమయం తర్వాత గంటపాటు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. యోగా, వెయిట్ లిఫ్టింగ్ తదితర ఆటలను బ్యాచ్‌లవారీగా నేర్పుతున్నారు. ఇటీవల ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాఠశాల నుంచి 9 పతకాలు సాధించారు. ఢిల్లీలో జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 67 కిలోల విభాగంలో శివ సాయి పాల్గొన్నారు. ఇదే విద్యార్థి బాసర ట్రిపుల్ ఐటీ లో స్పోర్ట్స్ కోటాలో సీటు సాధించాడు. ఇమ్రాన్ వివిధ రాష్ట్ర అంతర్జాతీయ క్రీడాకారులను పాఠశాలకు ఆహ్వానించి వారితో విద్యార్థులకు వివిధ ఆటల్లో తర్ఫీదునిస్తున్నాడు.
బొమ్మలను గీస్తూ..
బోధన చేస్తూ..
తాంసి: విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా పాఠశాల గోడలపై రంగురంగుల బొమ్మలు గీస్తూ బోధిస్తూ తాంసి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కవిత ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె గతేడాది క్రితం ఇక్కడు బదిలీపై వచ్చారు. విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తూనే తన కళా నైపుణ్యంతో తరగతి గదులతోపాటు, ప్రహరీలపై వివిధ బొమ్మలు వేశారు. గ్రామస్తుల సహకారంతో రంగుల కొనుగోలు చేయగా విద్యార్థులకు జ్ఞానం, ఆహ్లాదం కలిగించేలా బొమ్మలను స్వయంగా వేశారు.

బోర్బుపై బొమ్మలు వేసి..

బోర్బుపై బొమ్మలు వేసి..