
చంటిబిడ్డతో వాగు దాటి ఆస్పత్రికి..
ఇంద్రవెల్లి: మండలంలోని మామిడిగూడ గ్రామానికి చెందిన పెందోర్ ఈశ్వరి ఐదు నెలల బాలింత చంటిబిడ్డతో ఎత్తుకుని వాగు దాటి ఆస్పత్రికి తీసుకెళ్లింది. గ్రామానికి చెందిన పెందోర్ ఈశ్వరిబాయి చంటిబిడ్డకి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. భారీ వర్షం కారణంగా వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయింది. గురువారం వాగులో వరదనీరు కొంత తగ్గడంతో తల్లి ఆర్క గంగుబాయితో కలిసి సంకలో చంటి పాపను ఎత్తుకుని ప్రాణాలను తెగించి వాగు దాటింది. అక్కడి నుంచి కాలినడన ఆంధ్‌మామిడిగూడ వరకు వచ్చి ఆటోలో మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం అందించారు. వాగు వద్ద బ్రిడ్జి లేక ప్రతిఏటా వర్షాకాలంలో అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు దృష్టిసారించి మంజూరైన నిధులతో మామిడిగూడ వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.

చంటిబిడ్డతో వాగు దాటి ఆస్పత్రికి..