
వానలోనూ.. క్యూలోనే
ఓ వైపు వర్షం.. మరో వైపు యురియా కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పంటలను కాపాడుకోవడానికి అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. బుధవారం భారీ వర్షంలోనూ రైతులు యూరియా కోసం ఇలా మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయం ఎదుట ఉదయం 6 నుంచే క్యూ కట్టారు. మహిళలు సైతం గంటల తరబడి నిరీక్షించారు. అయితే ఒక్కొక్కరికి రెండు బ్యాగులు మాత్రమే ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. కనీసం ఎకరానికి ఒక బ్యాగు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, సాయంత్రం వరకు క్యూలో ఉన్నా యూరియా దొరకడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. – నార్నూర్