
రాజకీయ కక్షతోనే కేసీఆర్‌పై కుట్ర
ఆదిలాబాద్‌టౌన్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి కుమురంభీం చౌక్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రామ న్న మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారని తెలిపారు. అయితే మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగిపోవడాన్ని సాకుగా చూపు తూ లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టును అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రతిష్ట దక్కుతుందనే అక్కసుతో రాజకీయ కక్షసాధింపు చర్యలకుపాల్పడుతున్నారని విమర్శించారు. ఇందులో పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేశ్, సాజిదొద్దీన్, రాజ న్న, ప్రేమల, పవన్ నాయక్, సలీమ్ పాషా, వసంత్, కరుణ, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.