
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: నవరాత్రి ఉత్సవాలను ప్ర శాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని పలు గణపతి మండపాలను ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వజనిక్ గణేశ్‌మండలి, భుక్తాపూర్‌లోని శ్రీ సాయిరాజ్ గణేశ్‌మండలి, రిమ్స్‌లోని వినాయక మందిరం, ధోబి కాలనీ వద్ద గల గణపతి మండపాలను సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్రను ప్రశాంత వాతా వ రణంలో పూర్తి చేసుకో వాలని సూచించారు. డీజే, లేజర్ లైట్లు, పేపర్లు చల్లే యంత్రాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఆయా మండపాల వద్ద గల పాయింట్ బుక్‌లను పరి శీలించారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, స్వామి, ఫణిధర్, పోలీస్ సిబ్బంది, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు హనుమండ్లు తదితరులున్నారు.