
బియ్యం దుర్వినియోగం కానివ్వొద్దు
కైలాస్‌నగర్: పేదలు పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.కోట్ల రాయితీ భరించి పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మావల, ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ మండలాల లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులు పంపిణీ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవె న్యూ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, డీసీఎస్వో వాజీద్‌అలీతో కలిసి లబ్ధిదా రులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలోని అ ట్టడుగువర్గాలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అర్హులకే లబ్ధి చేకూర్చాలని సూచించారు. డబ్బులు డిమాండ్ చేసే దళా రులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని అధి కారులను ఆదేశించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే పోషకాలతో కూడిన సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. సన్నబియ్యం విక్రయించే లబ్ధిదారుల రేషన్‌కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ని రంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్లు శ్రీనివా స్, గోవింద్, వేణుగోపాల్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ బాబుసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.